Monday 4 February 2013

Please view below text

ఎందుకంటే........

3 వ సహస్రాబ్దపు  ప్రారంభముతోనే అనగా సెప్టెంబరు 11వ తేది నుండి ప్రపంచములోని
ప్రతి ఒక దేశము తమ తమ రక్షణ మరియు భవిష్య కాలపు రాజనీతి రీతుల గురించి కొత్త
కోణములో ఆలోచించడము మొదలయ్యింది. విశ్వములోని ప్రముఖమైన చాలా దేశాలకు ఉగ్రవాదము
యొక్క ముఖము యొక్క నిజమైన పరిచయము ఇంతకు మునుపే అయినది. అమేరికా మరియు రష్యా
దేశాలు ఉగ్రవాద సంఘటనలను ప్రోత్సహించి  ఒకరు మరొకరికి వ్యతిరేకముగా
ఉగ్రవాదాన్ని ఉపయోగించినారు. కాని 11వ సెప్టెంబరు దుర్ఘటన ఇంత తక్కువ సమయము
మరియు తక్కువ ఖర్చుతో జరిగిందంటే, ఇదే కారణముతో ఉగ్రవాదపు దుష్ట తంత్రము యొక్క
వాస్తవిక బలమును ప్రపంచములోనే ఎకమాత్రము బలవంతునిగా కనిపించే అమేరికా దేశము
రుచి చూసింది. గత ఎన్నో సంవత్సరముల నుండి భారతదేశము సహిస్తూ వస్తున్న ఉగ్రవాదుల
ఘాతుకపు అగ్ని అమేరికా నోసటిని ఒక్క క్షణములో ఎంత బలంగా తాకినదంటే దాని ముఖమే
పూర్తిగా మాడిపోయింది. మరియు ఇంతవరకు భారతదేశము ద్వార పంపబడిన ఉగ్రవాదపు
సాక్ష్యాలను నిర్లక్ష్యము చేస్తూ వచ్చిన అమేరికా దేన్నైతే తానే స్వయముగా
ఎరువులు, నీరు పోసి పెంచినదో, దానికి వ్యతిరేకముగా బహిరంగ మైదానములో పోరాడవలసిన
పరిస్థితి తప్పనిసరైనదిగా పరిణమించినది.


ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము కేవలము ఉగ్రవాదముగాని, ఉగ్రవాదమునకు వ్యతిరేకముగా
పోరాటముగాని కాకుండా ఇంతవరకు జరిగిన సంఘటనల ఆధ్యయనముతో భవిష్యత్తులో జరుగబోయే
జాగృతిక ఘటనల గురించి ఆలోచింపజేయుట. రాబోయే 20-25 సంవత్సరములవరకు సంఘర్షణమే ఈ
భూమిపై నిత్యకార్యక్రమము కాగలదు.ఇందులో ఏ మాత్రము అనుమానము లేదు. ఈ సంఘర్షణలో
మహాత్వపూర్ణమైనదేమంటే, సైద్ధాంతిక మరియు తాత్విక విలువల కొరకు జరిగే పోరాటము
కాదిది, కేవలము "కర్ర ఎవరిదో బఱ్ఱె వారిది"  అనే ఏక మాత్ర సూత్రము, కావున
రాజకీయపు ఎత్తులు,  పై ఎత్తులు, కుటిలనీతి ఎంత ఉపయోగించినా సంఖ్యాత్మకమైన
బలముతో ఆక్రమించుకోవటము, హింసించుట మొదలగు క్రూరాత్మక విధానాలదే పై చేయి
అవుతుంది. ఒకసారి యుధ్ధము మొదలవగానే ఇరుప్రక్కల మిత్ర్హదేశాల కూడిక అధికముతుంది.
ఆ తరువాత ఒకటి, తరువాత ఒకటి అందరూ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నియమాలను
ఉల్లంగించడము మొదలెడతారు. అపుడు తమ తమ చేతలను నైతికంగా సమర్ధించుటకు కూడా ఏ
పక్షానికి అవసరమున్నట్లు అనిపించదు. ఈ రోజుల్లో ఇదంతా అంశాలవారిగా జరుగుతున్నది.
రాబోయే సంవత్సరాలలో దీని ప్రమాణము తీవ్రముగా పెరుగగలదు.


సామాన్య ప్రజలు మరియు రాజకీయ నేతలు భావించుకునేదేమిటంటే యుద్ధ రహస్యసలహాల యొక్క
ఆకస్మిక ప్రకటన ఆవిష్కరణ చేయడము వల్ల యుద్ధ చర్చలేదా యుధ్ధమీమాంసను బహిరంగముగా
చర్చించే అవకాశము లేదు. భారత ప్రజలే కాకుండా ప్రపంచములోని ప్రతి దేశపు 90%
జనాభా యుద్ధము, యుధ్ధముయొక్క రాజకీయ కారణాలు వాటి పరిపూర్ణత గురించి కేవలము
సాధరణ విషయముగానే ఆలోచించగలరు. కాని యుద్ధ పరిణామాలు నూటికి నూరు శాతము ఇదే
సామాన్య ప్రజానీకము అనుభవించ వలసి వచ్చును మరియు ఎదురుకోవలసి యుండును.


కేవలము సదృఢమైన ప్రజాస్వామ్యము మాత్రమే యుద్ధము యొక్క భీషణ స్వరూపాన్ని సౌమ్య
పరచడానికి ఏకమాత్ర శక్తియై ఉన్నది. కాని నేడు ఎన్ని దేశాలలో ఇటువంటి వాస్తవిక
ప్రజాస్వామ్యము ఉన్నది? పార్లమెంటరీ ప్రజాస్వామ్యమునకు జనకుని వంటి గౌరవము
కలిగిన బ్రిటన్ యొక్క ప్రజాస్వామ్యము కూడా అవినీతి మరియు అంతర్గత కలహాల
కారణముగా బలహీనపడుతున్నది. ఖండములాంటి భారత దేశములో బాగా వికసించిన ప్రజాస్వామ్యము
కూడా ఎన్నో చిన్నా-పెద్ద పార్టీల ఉనికి కారణముగా దిశాహీనమగుచున్నది, మరియు
అవినీతి యొక్క నిరంతర అతివర్షము వల్ల "పెద్ద వరద" లాంటి అపత్తులో
మునిగియున్నది. రష్యా మరియు చైనా ఈ రెండు ప్రభుత్వాల వద్ద ప్రజాస్వామ్యము
యొక్క ఇసుమంతైనా అంశము లేదు. వీటితో పోలిస్తే అమేరికా యొక్క ప్రజాస్వామ్యము
పైపైన అధిక శక్తివంతముగా మరియు సమర్దవంతముగా కనిపిస్తున్నప్పటికీ, యువతలో
శీఘ్రగతితో పెరుగుతున్న చెడు అలవాట్ల ప్రమాణము మరియు మౌలిక పౌరులైన అమేరికా
వాసుల్లో తగ్గిపోతున్న విద్యా ప్రమాణాలు, పౌరులలో దేశభక్తి పట్ల తగ్గుతున్న
సక్రియత్వము, ఈ కారణాల వల్ల అమేరికా ప్రజాస్వామ్యము దోషరహితముగా నిలువలేక
పోవుచున్నది.ఇటువంటి పరిస్థితిలోనే అమేరికా గూఢాచార వ్యవస్థ ద్వార నిర్మిత
విశాలమైన వ్యాపక ప్రసార, ప్రచార శాఖలు అమెరికాతో కలిపి ప్రపంచములో మిగితా
దేశాలు ప్రసార మాధ్యమాలపై తన పట్టు ఉంచుటలో సఫలీకృతమైనది. భారత దేశములో
జాతివైరము నేర్పే పాకిస్తాను ఈ అతంకవాదపు గ్రంథము యొక్క "అమంగళాచరణ"
మై యున్నది. మరియు రాబోయే కాలములో పాకిస్తాను బహిరంగముగా యుద్ధ నాట్యము యొక్క
కథనము అతన్కవాదపు నేపథ్యములో అలంకరించుట మొదలు చేయబోవుచున్నది.


రాబోయే కాలములో ఈ రోజటి సమీకరణాలు రేపటివరకు నిలిచియుండుట కష్టమే. ప్రొద్దున 7
గంటల సమీకరణాలు, 7-05 నిమిషములకు, ప్రాధాన హేతువు సిద్ధించగానే ఊడబెరికి
త్రోసివేయగలరు. ఇది భవిష్యత్తు యొక్క కథనము కాదు, ఇది చారిత్రక అధ్యాయనము,
మరియు ప్రస్తుత స్థితి, మరియు జగత్తనేడి రంగము పై రధ్ధయిన పాత్రల సవరణ. రాబోయే
20 సంవత్సరాలలో పెక్కు ప్రాంతాలలో వేల కొద్ది ఘటనలు జరుగబోవుచున్నవి, ఈ
విషయాన్ని ప్రతి ఒక బుద్ధిమంతుడు, విచారశీలుడు, అధ్యయనశీలుడైన వ్యక్తి
భావిస్తున్నాడు. ఇప్పుడు కూడా వంద ఘటనలు సంభవిస్తుంటే అందులోంచి ఏరుకొని పది
ఘటనలు మాత్రమే ప్రాతినిధ్య రూపములో ఇక్కడ ఉల్లేఖించబడినవి. మిగిలిన 90% ఘటనలు
ఇక్కడ ఉల్లేఖించబడలేదు. ఇంతేకాని వాటి అంతర్భావము ఆధ్యయనములోకి అవశ్యముగా
గ్రహించబడినది.


ప్రతి సంవత్సరము క్యాలెండరు (దినదర్షిని) ప్రకాశింప (పబ్లిష్) బడుచున్నది,
ఎందుకంటే దాని వెనుక ఒక నిశ్చితమైన స్వరూపములో గణిత సూత్ర రచన ఉంటుంది, కాని
రాబోయే ఈ* "తృతీయమహాయుద్ధము" *యొక్క క్యాలెండరు ప్రతిరోజు కొత్తగా
ఉంటుంది. నాలాంటి
సర్వ సామాన్య మితృడు* "**తృతీయమహా**యుద్ధము"* గూర్చి కనీసము 2% శాతమైనా
పరిచయము చేయబడే విధముగా శబ్ధాలతో హారంగా గ్రుచ్చబడి మీ ముందుకు తీసుకొని
రాబడినది.



మీ మితృడు

అనిరుద్ధ.